Minister Harish Rao | ప్రజలకు బీజేపీ ఇచ్చింది ఏమన్నా ఉందంటే అది జీఎస్టీనే: మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్, బీజేపీలు రెండూ తోడు దొంగలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. ప్రజలను ఓట్లడిగే హక్కు వారికి లేదన్నారు. బీజేపీ (BJP) ప్రజలకు ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేనని చెప్పారు.
దుబ్బాక: కాంగ్రెస్, బీజేపీలు రెండూ తోడు దొంగలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. ప్రజలను ఓట్లడిగే హక్కు వారికి లేదన్నారు. బీజేపీ (BJP) ప్రజలకు ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేనని చెప్పారు. ఈ నెల 26న సీఎం కేసీఆర్ (CM KCR) ప్రజా ఆశీర్వాద సభను దుబ్బాకలో జరుగునున్నది. ఈనేపథ్యంలో సభా ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. సొంత పార్టీ నాయకులకే బీజేపీపై నమ్మకం లేదని, మరి ప్రజలకెలా విశ్వాసముంటుందని ప్రశ్నించారు. వారు చెప్పే మాటలన్నీ నీటిమీద రాతలేనని విమర్శించారు.
బీజేపీ మ్యానిఫెస్టో ఒక అబద్ధమని విమర్శించారు. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒక్క సీటేనని, ఈసారి డకౌటో లేదా ఒకటి రెండుకు సీట్లు గెలిచేది లేదన్నారు. అలాంటి పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటుచేస్తుందని సందేహం వ్యక్తంచేశారు. ప్రజల ఆకాంక్షలను ఏవిధంగా నెరవేస్తుందని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేలా, మోసం చేసేలా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చిందని, అభివృద్ధి కావాలంటే కేసీఆర్ రావాలన్నారు. 24 గంటల కరెంటు కావాలన్నా, కాళేశ్వరం నీళ్లు రావాలన్నా కేసీఆర్ రావాలంటున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు బీజేపీ ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేని విమర్శించారు. చేనేత కార్మికులపై జీఎస్టీ వేసిందని, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేద ప్రజలకు అన్యాయం చేసే పార్టీ బీజేపీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. హ్యాండ్లూం బోర్డును రద్దుచేసిందెవరు, బీడీ కార్మికులు, నేతన్నల నడ్డి విరిచిందెవరని ప్రశ్నించారు. బీడీ కట్టలపై జీఎస్పీ వేసి కార్మికుల పొట్టమీద కొట్టిందన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు బీడీ కార్మికులకు అన్యాయం చేశాయని వెల్లడించారు. బీడీ కట్టలపై పుర్రెగుర్తు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి, జీఎస్టీ వేసిన బీజేపీకి బీడీ కార్మికులను ఓట్లడిగే నైతిక హక్కులేదన్నారు. రెండు పార్టీలు బీడీ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేశాయని పేర్కొన్నారు. కానీ నెలనెలా రూ.2 వేల పెన్షన్ ఇచ్చి సీఎం కేసీఆర్ వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే బీడీ కార్మికుల పెన్షన్ రూ.5 వేలకుపెంచుకోబోతున్నామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేశారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Assembly elections
- BJP
- BRS
- CM KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

