Harish Rao | గృహహింస బాధితుల కోసం భరోసా, సఖీ కేంద్రాలు : మంత్రి హరీశ్‌రావు
Harish Rao | గృహ హింస బాధితుల కోసం భరోసా, సఖీ కేంద్రాలను సిద్ధిపేట జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి మరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి- వెళ్ళుపల్లిలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వృద్దాశ్రమం, మహిళా ప్రాంగణం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
Harish Rao | సిద్దిపేట : గృహ హింస బాధితుల కోసం భరోసా, సఖీ కేంద్రాలను సిద్ధిపేట జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి మరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి- వెళ్ళుపల్లిలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వృద్దాశ్రమం, మహిళా ప్రాంగణం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా సిద్దిపేట జిల్లా మహిళా సమైక్య భవనాన్ని నిర్మించామని తెలిపారు. రూ. కోటితో మూడు ప్రాంగణాలనుకలిపి ప్రహరీ గోడ నిర్మించామని చెప్పారు. మరో రూ. కోటి పది లక్షల తో సీసీ కెమెరాలు, ఫర్నిచర్ అందుబాటులోకి తెస్తామన్నారు.
సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో భరోసా, సఖి, ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్, బాల రక్ష భవన్ నిర్మించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శిశు గృహను కూడా ఏర్పాటు చేశాం. ఇక్కడ వృద్ధాశ్రమం, మహిళా ప్రాంగణం, జిల్లా మహిళా సమాఖ్య భవనాలను ఏర్పాటు చేశాం. వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు పట్టించుకోని వయోవృద్ధులను తల్లిదండ్రులలాగ చూసుకుంటామన్నారు. మహిళా ప్రాంగణంలో మహిళలకు వృత్తి శిక్షణ ఇస్తాం. గృహ హింస బాధితుల కోసం భరోసా, సఖీ కేంద్రాలు, అనాథ బాలల కోసం శిశు గృహ ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగాలు చేసే మహిళల కోసం ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్ అందుబాటులోకి తెచ్చామన్నారు. అవసరమైన వారు ఉపయోగించుకునేలా అందరికీ వీటి గురించి తెలపాలని హరీశ్‌రావు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మహిళా సమాఖ్య సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు రూ.1,800 కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

