Telangana | ఈ నెలాఖరు వరకు 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..!
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని టీచింగ్ ఆస్పత్రుల( Teaching Hospitals ) పరిధిలో భర్తీ చేస్తున్న 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్( Asst Professor ) పోస్టుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు( Minister Harish Rao ) ఆదేశించారు. వెరిఫికేషన్ సహా, ఇతర ప్రక్రియలు పూర్తి అయిన నేపథ్యంలో తుది ఫలితాలు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు సత్వరం చేపట్టాలని సూచించారు.
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని టీచింగ్ ఆస్పత్రుల( Teaching Hospitals ) పరిధిలో భర్తీ చేస్తున్న 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్( Asst Professor ) పోస్టుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు( Minister Harish Rao ) ఆదేశించారు. వెరిఫికేషన్ సహా, ఇతర ప్రక్రియలు పూర్తి అయిన నేపథ్యంలో తుది ఫలితాలు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు సత్వరం చేపట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్( CM KCR ) ఆలోచన మేరకు పేదలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేసి, నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు.
మంగళవారం ఆరోగ్యశ్రీ( Arogyasri ) పథకం అమలు, పురోగతిపై ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. డీఎంఇ, డీపీహెచ్, టీవీవీపీ పరిధిలోని ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరగటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 2021-22తో పోల్చితే, 2022-23 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు గణనీయంగా పెరిగాయి. డీఎంఈ పరిధిలో 72,225 నుంచి 1,08,223కు పెరగగా, టీవీవీపీలో 66,153 నుంచి 99,744కు పెరిగాయి. డీపీహెచ్ పరిధిలో కొత్తగా ఆరోగ్య శ్రీ సేవలు ప్రారంభం కావడం వల్ల 14,965 కేసులు నమోదు అయ్యాయి. ఈ పెరుగుదలకు కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.
అందుబాటులోకి మరిన్ని పీజీ సీట్లు..
కొత్త మెడికల్ కాలేజీల( Medical Colleges ) ద్వారా మరిన్ని పీజీ సీట్లు అందుబాటులోకి రావడం, ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెరగటం, ప్రభుత్వ ఆస్పత్రుల( Govt Hospitals ) పట్ల ప్రజల్లో విశ్వాసం పెరగటం, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని ఆస్పత్రుల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు మొదలు పెట్టడం వల్ల ఈ గణనీయమైన మార్పు సాధ్యమైందన్నారు. ఆరోగ్య శ్రీ బృందంతో పాటు, ఆరోగ్య మిత్రలు చేస్తున్న కృషి కూడా ఇందులో ఉందన్నారు. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాలు మరింత ప్రభావవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వెల్నెస్ సెంటర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
జూమ్ ద్వారా నిర్వహించిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్ఛి, డీఎంఈ రమేష్ రెడ్డి, నిమ్స్, ఎంఎన్‌జే డైరెక్టర్లు, ఆరోగ్య శ్రీ అధికారులు, జిల్లా కోఆర్డినేటర్లు, టీం లీడర్లు, అన్ని టీచింగ్, టీవీవీపీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

