Harish Rao | ఏజెన్సీ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య సేవలకు హెలికాప్టర్లు: మంత్రి హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సీఎం
Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించే విషయంలో అవసరమైతే హెలికాప్టర్ సేవలు వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సన్నద్ధత, ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవలసిన చర్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా వైద్యాధికారులతో గురువారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డిఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస్ రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఆయుష్ డైరెక్టర్ హరిచందన సహా అన్ని జిల్లాల ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సబ్ సెంటర్ స్థాయి నుండి హైదరాబాద్‌లోని ప్రధాన ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉండి, ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు గాను రాష్ట్ర స్థాయిలో 24×7 స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదే విధంగా జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ప్రజలకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
108, అమ్మ ఒడి వాహన సేవలను వినియోగించుకోవాలి..
108, 102 వాహన సేవలు పూర్తి స్థాయిలో వినియోగించాలని హరీశ్‌రావు చెప్పారు. గర్బిణులను ఇంటి నుంచి ఆసుపత్రికి, ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చేందుకు అమ్మ ఒడి వాహన సేవలు వినియోగించాలన్నారు. కేసీఆర్ కిట్ డేటా ఆధారంగా గర్భిణుల డెలివరీ డేట్ ముందుగా తెలుసుకొని, వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. గర్భిణులు, డయాలసిస్ పేషెంట్లకు వైద్య సేవలు అందించే విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని హరీశ్‌రావు ఆదేశించారు.
పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలి..
కలుషిత ఆహార పదార్థాలు తీసుకొని ప్రజలు ఇబ్బంది పడుతుంటారు.. ఆహార నాణ్యత పై దృష్టి సారించాలి అని మంత్రి సూచించారు. విద్యార్థుల హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లను ఆయా పరిధిలోని ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్ వెళ్లి సందర్శించాలి. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి, పరీక్షలు నిర్వహించి వైద్యం అందించాలి. పరిశుభ్రత పట్ల అందరికీ అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.
వైద్యులు సమయపాలన పాటించాలి..
ఆసుపత్రులు, వార్డులు, పరిసర ప్రాంతాల్లో శుభ్రత ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సూపరింటెండెంట్ లదే అని మంత్రి స్పష్టం చేశారు. వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. పేషెంట్లతో ఆప్యాయంగా మాట్లాడి మంచి వైద్య సేవలు అందించాలన్నారు.
జిల్లా, ఏరియా, సీహెచ్‌సీ, ఎంసీహెచ్ ఆసుపత్రుల వారీగా ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి చెప్పారు.
పాము, తేలు కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలి..
పీహెచ్సీ స్థాయిలో పాము, తేలు కాటు మందులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని హరీశ్‌రావు సూచించారు. ప్రభుత్వ మందుల స్టోర్లలో అవసరమైనన్ని మందులు ఉన్న నేపథ్యంల పీహెచ్‌సీల్లో మందులు లేవు అనే మాట రావొద్దన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
వాతావరణ శాఖ అందించే సూచనలు పాటిస్తూ, ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు పూర్తి సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి. పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సత్వరం అందేలా చూడాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత జిల్లాల పరిధి వైద్యాధికారులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల అరోగ్య పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బస్తీ దవాఖానలు పూర్తి స్థాయిలో పని చేయాలని, తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ల ద్వారా పరీక్షలు నిర్వహించి, తక్షణ వైద్య సేవలు అందించాలని హరీశ్‌రావు ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

