టిఫా స్కానింగ్ మిషన్లను ప్రారంభించిన హరీశ్‌రావు
Minister Harish Rao | సర్కారు దావాఖానల్లో గర్భిణుల సౌకర్యార్థం కొత్తగా ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 43 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 56 టిఫా
హైదరాబాద్ : సర్కారు దావాఖానల్లో గర్భిణుల సౌకర్యార్థం కొత్తగా ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన 56 టిఫా స్కానింగ్ యంత్రాలను పేట్ల బురుజు ఆసుపత్రి నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా టిఫా స్కానింగ్ మిషన్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 100 మందిలో ఏడుశాతం శిశువుల్లో లోపాలుంటాయని, వాటిని టీఫా స్కాన్స్‌తోనే గుర్తించడం సాధ్యమన్నారు. పేట్ల బురుజు ఆసుపత్రిలోనే కేసీఆర్ కిట్ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని, రాష్ట్రంలో 99.2శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరిగాయన్నారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందులో భాగంగానే రూ.20 కోట్ల వ్యయంతో 44 ప్రభుత్వ హాస్పిటళ్లలో 56 అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది. వీటితో సాయంతో నెలకు 20వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులుబాటు వీలు కలుగనున్నది. ప్రైవేటు దవాఖానాల్లో రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఖర్చయ్యే ఈ స్కానింగ్‌ను ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగానే చేయనున్నారు. మిషన్ల సహాయంతో తల్లిగర్భంలోని బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే సులువుగా గుర్తించవచ్చని తద్వారా, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు వీలు ఉంటుంది. 18 నుంచి 22 వారాల మధ్యలో టిఫా స్కానింగ్ చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

