రాహుల్‌ది గోబెల్స్ ప్రచారమే
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే అబద్ధాలను చెప్తూ వాటినే నిజాలుగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయనది కేవలం గోబెల్స్ ప్రచారమేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
- అబద్ధాలను నమ్మించే ప్రయత్నం
- ‘కాళేశ్వరం’లో అవినీతి పెద్ద జోక్
- కాంగ్రెస్ హామీలన్నీ ఉత్త మాటలే
- మ్యానిఫెస్టోను అమలు చేసిన చరిత్ర ఆ పార్టీకి లేదు
- ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆరే..
- రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే
- ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే అబద్ధాలను చెప్తూ వాటినే నిజాలుగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయనది కేవలం గోబెల్స్ ప్రచారమేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దాదాపు రూ.85 వేల కోట్ల ఖర్చుతో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు రాహుల్ ఆరోపించడాన్ని అతిపెద్ద జోక్‌గా పేర్కొన్నారు. గతంలో ఏ మ్యానిఫెస్టోనూ అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదని, బీఆర్ఎస్ మాత్రం చెప్పనివి కూడా చేసి చూపిందని పేర్కొన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు.
బుధవారం ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రాష్ట్ర ప్రభుత్వ విజయాలను వివరించడంతోపాటు విపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలపై తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. 2009లో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయలేదని, గత ఆరు దశాబ్దాల్లో ఆ పార్టీ చేయలేని పనులను సీఎం కేసీఆర్ కేవలం పదేండ్లలోనే చేసి చూపారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అంటేనే ఉత్త మాటలు, మూటలు, ముఠాలు, కుమ్ములాటలని.. టికెట్లను సైతం అమ్ముకుంటున్నట్టు స్వయంగా ఆ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే అనేక పార్టీలు మారిన చరిత్ర టీపీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డిదని, సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే ఆయన ‘బలిదేవత’ అన్నాడని గుర్తుచేశారు. తమది దొరల తెలంగాణ అయితే, కాంగ్రెస్‌ది దొంగలు, బ్రోకర్లు, ముఠాల తెలంగాణనా? అని ప్రశ్నించారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ సీఎం కేసీఆరే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ఆ ఘనత బీఆర్ఎస్దే..
గతంలో నీరు, విద్యుత్తు సమస్యల ప్రస్తావన లేకుండా అసెంబ్లీ సమావేశాలు జరిగేవికాదని, ఇప్పుడు వాటి ఊసే లేకపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని మంత్రి హరీశ్ చెప్పారు. దేశంలో తొలిసారి రైతుబంధు, దళితబంధు పథకాలను ప్రవేశపెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేస్తూ.. బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టి తన మ్యానిఫెస్టోలో పెట్టుకున్నదని, ఉచిత కరెంటును ‘ఉత్త కరెంటు’గా మార్చిన ఘనత ఆ పార్టీదేనని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రూ.200గా ఉన్న వృద్ధాప్య పింఛన్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకేసారి రూ.2 వేలకు పెంచడంతోపాటు రైతుబంధు కింద 62 లక్షల మంది రైతులకు 11 విడతల్లో మొత్తం రూ.73 వేల కోట్లు ఇచ్చామని, ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద 13 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు రూ.12,470 కోట్లు అందజేశామని వివరించారు.
రాజకీయ లబ్ధి కోసమే మోదీ అడ్డగోలు వ్యాఖ్యలు
కేసీఆర్ ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధి గురించే మాట్లాడతారని గతంలో స్వయంగా పార్లమెంట్‌లోనే చెప్పిన మోదీ.. ఇప్పుడు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర సాధన కోసం పదవులకు ఎన్నోసార్లు రాజీనామా చేయడంతోపాటు ఏకంగా ప్రాణత్యాగానికే సిద్ధపడిన నేత కేసీఆర్ అని గుర్తుచేశారు. ఆయన ఆమరణ దీక్షతో తెలంగాణ అట్టుడకటం వల్లే ప్రత్యేక రాష్ర్టాన్ని ఇచ్చారని గుర్తుచేశారు.
‘కేసీఆర్ బీమా’తో పేదలకు సామాజిక భద్రత
బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే ‘కేసీఆర్ బీమా’ పథకం ద్వారా దాదాపు కోటి పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడంతోపాటు రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇవ్వనున్నట్టు మంత్రి హరీశ్ చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని చెప్పారు. ‘ధరణి’ పోర్టల్ రాకముందు భూ రికార్డులను ఎవరైనా మార్చేసేవారని, ఇప్పుడు యజమాని వేలుముద్ర లేకుండా ఎలాంటి మార్పు చేసేందుకు అవకాశమే లేదని పేర్కొన్నారు. గతంలో పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కట్టించకపోవడం వల్లే నేడు డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని అమలు చేయాల్సి వస్తున్నదని, అప్పట్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.40 వేలు ఇస్తే.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తున్నదని తెలిపారు. కొవిడ్ సంక్షోభం వల్ల వ్యవసాయ రుణాల మాఫీలో కొంత జాప్యం జరిగిందని, అయినా ఇప్పటివరకు రూ.31 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని చెప్పారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మరిన్ని పథకాలు
రాష్ట్ర వృద్ధిరేటు పెరుగుదలను దృష్టిలో ఉంచుకొనే కొత్త పథకాలపై నిజాయితీగా హామీలు ఇచ్చామని, నిధులకు ఎలాంటి లోటు లేనందున మరికొన్ని పథకాలను బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చేర్చాలన్న ఆలోచన ఉన్నదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రత్యేకించి యువతకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని యోచిస్తున్నామని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు తెలివైనవారని, రాష్ర్టాన్ని సుభిక్షంగా ఉంచుకునేందుకు మళ్లీ బీఆర్ఎస్ను గెలిపించడం ఖాయమని తెలిపారు. రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులందరితోపాటు సెటిలర్లంతా బీఆర్ఎస్ వెంటే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎవరికీ బీటీమ్ కాదని, ప్రజల టీమ్ అని, ప్రజలే తమకు హైకమాండ్ అని తేల్చిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

