Minister Harish rao | బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ: మంత్రి హరీశ్ రావు
బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
హైదరాబాద్: బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర (Gas Cylinder price) పెంచడాన్ని నిరసిస్తూ ఘట్కేసర్లో బీఆర్ఎస్ పెద్దఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో (Minister Malla reddy) కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గత యూపీఏ (UPA) హయాంలో గ్యాస్‌పై ప్రభుత్వం రూ.2.14 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చేదని గుర్తుచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసిందని విమర్శించారు. గతంలో గ్యాస్ ధర రూ.400 ఉంటేనే బీజేపీ గగ్గోలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరి ఇప్పుడు రూ.1100 దాటిందని, ఆ పార్టీ నాయకులు ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. ఉపాధిహామీ పథకంలో రూ.30 వేల కోట్లు కోత పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఎం కిసాన్ యోజనలో భారీగా లబ్ధిదారులను తగ్గించారని వెల్లడించారు.
సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి బీజేపీ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తున్నదని చెప్పారు. ఎన్నికల తర్వాత గ్యాస్ ధరలు పెంచడం ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు రాగానే గ్యాస్‌పై 10 పైసలు తగ్గిస్తారని, అవి పూర్తవగానే రూ.100 పెంచుతారని దుయ్యబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

