Harish Rao | హంతకుడే సంతాపం తెలిపినట్టుంది చిదంబరం తీరు..! హరీశ్‌రావు ఫైర్
Harish Rao | కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరంపై రాష్ట్ర మంత్రి మరీశ్‌రావు ధ్వజమెత్తారు. చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది అని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు.
Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరంపై రాష్ట్ర మంత్రి మరీశ్‌రావు ధ్వజమెత్తారు. చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది అని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. గాంధీ భవన్లో చిదంబరం మాట్లాడిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని హరీశ్‌రావు విమర్శించారు. పొట్టి శ్రీరాములు ఆంధ్రా రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ? అని ప్రశ్నించారు. అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? అని నిలదీశారు. చరిత్ర తెలియనిది కేసీఆర్‌కు కాదు.. చిదంబరమే చరిత్ర తెలియకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ రాష్ట్రంగా ఉండే..
అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదం అని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయంపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహిస్తే మంచిది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం తెలుసుకుంటే మంచిది అని సూచించారు.
ఎవరెన్ని ట్రిక్కులు చేసినా.. గెలుపు బీఆర్ఎస్దే
చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు. చిదంబరానికి దమ్ముంటే తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ సాధించింది కేసీఆర్, సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మోడల్‌గా నిలిపింది కేసీఆర్. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించబోతున్నరు అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉంది
తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది.👉 పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది.
👉పొట్టి…— Harish Rao Thanneeru (@BRSHarish) November 16, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

