కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయండి.. కేంద్రాన్ని కోరిన హరీశ్‌రావు
Minister Harish Rao | రాష్ట్రానికి కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. కొవాగ్జిన్ 8 లక్షలు, కొవిషీల్డ్ 80 వేల డోసులు ఉండగా కోర్బివాక్స్ డోసులు సున్నా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో బూస్టర్ డోసు వేగవంతం
హైదరాబాద్ : రాష్ట్రానికి కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయాలని వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. కొవాగ్జిన్ 8 లక్షలు, కొవిషీల్డ్ 80 వేల డోసులు ఉండగా కోర్బివాక్స్ డోసులు సున్నా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో బూస్టర్ డోసు వేగవంతం చేసేందుకుగాను అవసరమైన వ్యాక్సిన్లను రాష్ట్రానికి సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. బూస్టర్ డోసు విషయంలో జాతీయ సగటు 23 శాతం ఉంటే తెలంగాణ సగటు 48 శాతంగా మెరుగైన స్థితిలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ నిత్య పర్యవేక్షణ, అప్రమత్తత చేయడం, ప్రజల్లో అవగాహన పెంచడం వల్ల ఇది సాధ్యమైందన్నారు.
కరోనా పరిస్థితులు రాష్ట్రాల సన్నద్ధతపై కేంద్ర వైద్యరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పలు విజ్ఞప్తులు చేశారు.
ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరు, ప్రభావం, చికిత్స వంటి అంశాల గురించి రాష్ట్రాలకు తెలియజేయాలని, ఈ అవగాహనతో మరింత అప్రమత్తంగా ఉండడం సాధ్యం అవుతుందన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్స్ లను సమీప ఆస్పత్రులతో అనుసంధానం చేసేలా మ్యాపింగ్ చేసే విధానాన్ని తీసుకురావాలన్నారు.
యాన్యువల్ మెంటెనెన్స్ కాంట్రాక్ట్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన వెంటిలేటర్లు, పీఎస్ఎ ప్లాంట్స్ మరమ్మతులు జరగటం లేదని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముందస్తు చర్యలో భాగంగా రాష్ట్రాల్లో అవసరమైన వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఇసిఆర్పి -3 (ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్ -3) రూపొందించే విషయమై ఆలోచించాలన్నారు.
ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, టిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, డిఎంఇ రమేష్ రెడ్డి, డిహెచ్ శ్రీనివాస్ రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

