Minister Giriraj Singh | వినూత్న ఆలోచనలతో తెలంగాణ ముందంజ : కేంద్ర మంత్రి ప్రశంస
Minister Giriraj Singh | రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) వినూత్నంగా ఆలోచించి అమలు చేయడంలో ముందుందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్(Union Minister Giriraj Singh) ప్రశంసించారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) వినూత్నంగా ఆలోచించి అమలు చేయడంలో ముందుందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్(Union Minister Giriraj Singh) ప్రశంసించారు. ఇదే తరహాలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో బాగా పనిచేస్తుందని అభినందించారు.
ఆదివారం రాజేంద్రనగర్ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ) కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలను గ్రీన్ విలేజీలు(Green Villages)గా మార్చడంపై అధికారులు దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధిలో హర్టికల్చర్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గ్రామాల్లో కాలుష్య కారకాలను వాడకుండా చూడాలని తెలిపారు. మొదట ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన వాటిల్లో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలనలో జీవనోపాధులపై దృష్టి సారించాలన్నారు.
వ్యవసాయేతర అంశాలపై మహిళలను దృష్టి సారించే విధంగా చేసి వారి ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు . దీని కోసం గ్రామీణాభివృద్ధి శాఖ, స్త్రీనిధి, సెర్ప్లను భాగస్వామ్యం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు, గ్రామీణాభివృద్ధి స్పెషల్ కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

