కరీంనగర్: సర్వాయి పాపన్న (Sarvai Papanna) ఆశయ సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. గోల్కొండ (Golkonda) కోటపై జెండా ఎగురవేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. సర్వాయి పాపన్న 313 వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో (Karimnagar) ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ పోరాట పటిమను, ఆయన పౌరుషాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని, రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.