రైతాంగాన్ని మోసం చేస్తున్నది మోదీనే : మంత్రి ఎర్రబెల్లి
minister Dayaker rao | రైతాంగాన్ని మోసం చేస్తున్నది ప్రధాని నరేంద్ర మోదీనే అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులు లాభ పడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని
మహబూబాబాద్ : రైతాంగాన్ని మోసం చేస్తున్నది ప్రధాని నరేంద్ర మోదీనే అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులు లాభ పడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం ఖానాపూర్ గ్రామంలో ప్రాథమిక రైతు సేవా సహకార సంస్థ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దయాకర్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పరిపాలనతో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి నీళ్లు అందించిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. సాగు నీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు లాంటి పథకాల అమలు వల్ల పంటలు బాగా పండిస్తున్నారు. దిగుబడి కూడా పెరిగిందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను మన ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. పక్క రాష్ట్రాల రైతులు మన రాష్ట్రంలో పుట్టనందుకు బాధ పడుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు వస్తే వెంటనే వాటిని పరిష్కరించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

