తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు! మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వ మానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయం. తెలంగాణ గంగా జమునా తేహజీబ్. రాష్ట్రంలో పాలు నీళ్లలా ప్రజలంతా మత, కుల, ప్రాంత, వర్గ బేధాలు లేకుండా పండుగలు జరుపుకుంటారు.