Minister Errabelli | నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలి : మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli ) అధికారులకు ఆదేశించారు.
హైదరాబాద్ : నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli ) అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ లోని సచివాలయం నుంచి శనివారం జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలు, డీఆర్డీవోలతో పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్ లతో వీడియో కాన్ఫరెన్స్ ( Video Conference ) నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR ) నేతృత్వంలో ప్రభుత్వం అన్ని గ్రామాలను కడిగిన ముత్యంలా చేశారన్నారు. రాష్ట్రంలో 12 వేల 769 గ్రామ పంచాయతీలలో 6,544 గ్రామ పంచాయతీలకు భవనాలు ఉన్నాయన్నారు. మిగతా 6 వేల 225 గ్రామ పంచాయతీలలో నిధులు మంజూరు చేయగా నూతనంగా నిర్మిస్తున్న 3,622 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
హరితహారం లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ కు 6.7 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం ఇవ్వగా, ఇప్పటి వరకు 2.25 కోట్ల మొక్కలు నాటినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మిగతా మొక్కలను కూడా త్వరగా నాటాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా వ్యవసాయ భూముల్లో దశాబ్ది సంపద వనాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

