సమాన అవకాశాలు, సమ భావనతోనే సుఖశాంతులు: మంత్రి ఎర్రబెల్లి
పూర్ణాహుతి సంకల్పం తీసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ఉదయం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంను కుటుంబ సమేతంగా సందర్శించారు. గోపాలోపాయన పురస్కారాన్ని తమిళనాడుకు చెందిన మాడభూషి వరదరాజకు
హైదరాబాద్: అందరూ సమానం అనే విషయాన్ని చాటుతున్న రామానుజుడి దృక్పథమే ప్రపంచానికి ఏకైక దారి అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. సమాన అవకాశాలు, సమ భావనతోనే సమాజంలో సుఖశాంతులు విరాజిల్లుతాయని ఆయన అన్నారు. పూర్ణాహుతి సంకల్పం తీసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ఉదయం ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంను కుటుంబ సమేతంగా సందర్శించారు. రామానుజ స్వామి వారిని దర్శించుకున్న ఎర్రబెల్లి.. జీయర్ ట్రస్ట్‌లో 1035 హోమగుండాల శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువు, గోపాలోపాయన పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 100 ఏండ్ల క్రితమే ప్రపంచానికి సమతను చాటిన రామానుజుల స్వామి వారి భారీ విగ్రహాన్ని ముచ్చింతల్‌లో ప్రతిష్ఠించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి సంతోషం వ్యక్తం చేశారు. రామానుజుల వారి సంకల్పాన్ని సాఫల్యం చేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి, ఈ మహా యజ్ఞానికి తోడుగా నిలిచిన మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు చరిత్రలో నిలిచి పోతారని మంత్రి కొనియాడారు. సమతా మూర్తి విగ్రహ ప్రతిష్ఠ రాష్ట్రం పేరు ప్రఖ్యాతులను మరింత పెంచిందని, ప్రపంచ భక్తి పటంలో అంతర్జాతీయ సమతా క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా ముచ్చింతల్ నిలిచిపోనున్నదని అన్నారు.

చినజీయర్ స్వామి గురువు గోపాలాచార్యుల పేరిట ఇచ్చే గోపాలోపాయన పురస్కార ప్రదానోత్సవంలో మంత్రి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఉషా దయాకర్ రావు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. గోపాలోపాయన పురస్కారాన్ని తమిళనాడుకు చెందిన మాడభూషి వరదరాజకు బహూకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

