విచారణకు మంత్రి, ఎమ్మెల్యే డుమ్మా
ఇటీవల ఢిల్లీలో జరిగిన వివాదంపై గాంధీభవన్‌లో గురువారం జరుగాల్సిన విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ, జుకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు డుమ్మాకొట్టారు.
- గాంధీభవన్‌కు టీపీసీసీ పిలుపు
- రాలేమన్న దామోదర, తోట
- ఎదురుచూసిన టీపీసీసీ చీఫ్
- వాయిదా వేసిన మహేశ్‌కుమార్
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తేతెలంగాణ): ఇటీవల ఢిల్లీలో జరిగిన వివాదంపై గాంధీభవన్‌లో గురువారం జరుగాల్సిన విచారణకు మంత్రి దామోదర రాజనర్సింహ, జుకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు డుమ్మాకొట్టారు. ఢిల్లీలోని ఒక హోటల్ లాబీలో ఆ ఇద్దరి మధ్య జరిగిన గొడవను తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వివరణ ఇవ్వాల్సిందిగా గాంధీభవన్‌కు రావాలని వారిని పిలిచారు. గురువారం ఉదయం 10:30 గంటలకు మంత్రి దామోదర, మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో గాంధీభవన్‌లో చర్చించాల్సి ఉన్నది.
చివరి నిమిషంలో క్యాబినెట్ సమావేశం, ఆరోగ్య కారణాల రీత్యా మంత్రి, వ్యక్తిగత కారణాల వల్ల ఎమ్మెల్యే రాలేకపోతున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మొదట పీసీసీతో భేటీకి దామోదర ఓకే చెప్పారు. దీంతో మంత్రితో సమావేశమయ్యేందుకు మహేశ్‌కుమార్ గాంధీభవన్‌కు చేరారు. పీసీసీ చీఫ్ వచ్చిన తర్వాత తాను రావడం లేదంటూ మంత్రి సమాచారం ఇచ్చారు. రాజనరసింహ రాకపోవడంతో గాంధీభవన్ నుంచి మహేశ్ కుమార్ ఎమ్మెల్యేను కూడా కలువకుండానే వెనుదిరిగారు. దీంతో టీపీసీసీ ఈ చర్చలను వాయిదా వేసింది. త్వరలోనే మరో తేదీ ఖరారు చేసి, ఇద్దరు నేతలను విడివిడిగా, లేదా కలిపి విచారించి ఈ వివాదానికి ముగింపు పలుకాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నోటీసులు ఇవ్వకపోవడం వల్లే గైర్హాజరు
మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు టీపీసీసీ నుంచి గానీ, క్రమశిక్షణ కమిటీ నుంచి గానీ ఎలాంటి నోటీసులు జారీచేయలేదు. కేవలం ఆ ఇద్దరితో మాట్లాడుదామని టీపీసీసీ అధ్యక్షుడు ఫోన్ ద్వారా పిలిచారని, అందువల్లే వాళ్లు ఈ సమావేశాన్ని సీరియస్‌గా తీసుకోలేదని తెలిసింది. తప్పు చేసినట్టు భావించి క్రమశిక్షణ కమిటీ నోటీసులిస్తే, దానికి బాధ్యతగా సంబంధిత నేతలు వివరణ ఇస్తారు. ఫోన్ ద్వారా పిలిస్తే సమాధానమివ్వాల్సిన అవసరంలేదని భావించడంతో హాజరు కాలేదని తెలిసింది.
అసలు వివాదం ఇదే!
న్యూఢిల్లీలోని షాంగ్రిలా హోటల్లో డీసీసీ (సంగారెడ్డి, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల నియామకాలు, ఓ నేత ఎమ్మెల్సీ సీటు కోసం పైరవీ చేస్తున్నారనే విషయంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నదనే ప్రచారం జరిగింది. తోటి ఎమ్మెల్యేల ముందే మంత్రి తనను తీవ్ర పదజాలంతో దూషించారని, బెదిరించారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు టీపీసీసీకి ఫిర్యాదు చేశారు.
ఘటనకు సంబంధించిన షాంగ్రిలా హోటల్ సీసీటీవీ పుటేజీని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తెప్పించారని, తదుపరి విచారణలో ఆ పుటేజీని టీపీసీసీకి సాక్ష్యంగా సమర్పించనున్నట్టు తెలిసింది. లాబీల్లో మంత్రి, ఎమ్మెల్యే ఎదురుపడ్డ సమయంలో తీవ్ర స్వరంతో ఎమ్మెల్యే మీద మంత్రి విరుచుకుపడ్డారనే ప్రచారం హస్తం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది.ఆ సమయంలో రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు అకడే ఉన్నారని సమాచారం.
సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో పక జిల్లా ఎమ్మెల్యే జోక్యాన్ని మంత్రి సీరియస్‌గా ప్రశ్నించినట్టు కాంగ్రెస్ నేతలే చెప్పుకొంటున్నారు. మంత్రిగారూ అంటూ.. పలుకరించిన పాపానికి తనపై నోరు పారేసుకున్నారని జుకల్ ఎమ్మెల్యే సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రి మాటలు తనను మనస్తాపానికి గురిచేశాయంటూ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట ఎమ్మెల్యే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

