సీఎం కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది : అక్బరుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనంతరం అక్బరుద్దీన్ ఓవైసీ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. ప్రజలకు కేసీఆర్ మరింత సేవ చేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే సీఎం కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉందన్నారు.
పోలీస్, మెడికల్, ఎడ్యుకేషన్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఓవైసీ సూచించారు. అదే విధంగా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం ఉర్దూ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. పాతబస్తీలో స్టడీ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తున్నాయన్నారు. అందరమూ కలిసి బంగారు తెలంగాణ కల సాకారం చేద్దామని ఓవైసీ పిలుపునిచ్చారు. సభ సజావుగా నడిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఓవైసీ అభినందనలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

