50 మందిలోపు విద్యార్థులున్న బడులను విలీనం చేయండి
50 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేయాలని కేంద్ర విద్యా శాఖ ఆదేశించింది. శుక్రవారం వివిధ రాష్ర్టాల విద్యాశాఖ అధికారులతో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా, రాజస్థాన్‌లో 50 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను ఇప్పటికే విలీనం చేశారని గుర్తుచేశారు.
- రాష్ర్టాలకు కేంద్రం సూచన
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): 50 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను విలీనం చేయాలని కేంద్ర విద్యా శాఖ ఆదేశించింది. శుక్రవారం వివిధ రాష్ర్టాల విద్యాశాఖ అధికారులతో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా, రాజస్థాన్‌లో 50 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలను ఇప్పటికే విలీనం చేశారని గుర్తుచేశారు. ఇలా చేయడం ద్వారా వనరులను సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మెరుగైన విద్యను అందించినవాళ్లమవుతామని తెలిపారు. మిగతా రాష్ర్టా లూ ఈ దిశగా కృషి చేయాలని సూచించారు. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ ఈ ప్రతిపాదనపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపినట్టు సమాచారం.
రాష్ట్రంలో పరిస్థితి ఇలా..
రాష్ట్రంలో జీరో విద్యార్థులున్న పాఠశాలలు 1,739 ఉన్నాయి. ఒకే విద్యార్థి ఉన్న స్కూళ్లు 44, ఇద్దరు విద్యార్థులున్న స్కూళ్లు 92, ముగ్గురు విద్యార్థులున్న పాఠశాలలు 119 ఉన్నాయి. నలుగురు విద్యార్థులున్న స్కూళ్లు 178 ఉండగా, ఐదుగురు విద్యార్థులున్న స్కూళ్లు 265 ఉన్నాయి. ఆరుగురు విద్యార్థులున్న స్కూళ్లు 266, ఏడుగురు విద్యార్థులున్నవి 276, ఎనిమిది మంది విద్యార్థులున్న స్కూళ్లు 323, తొమ్మిది మంది ఉన్నవి 313, 10 మంది విద్యార్థులున్నవి 353 ఉన్నాయి. 0-10 మంది విద్యార్థులున్న పాఠశాలలు మొత్తం 3,968 ఉండటం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

