హైదరాబాద్ : పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంకు చెందిన స్వచ్ఛంద సేవకులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద 13. 02.1893లో హైదరాబాద్ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ మహబూబ్ కళాశాలలో నిర్వహించిన ఆధ్యాత్మిక సమావేశం‘My Mission to the West’ ను గుర్తించి’ ‘వివేకానంద దినోత్సవం’ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించటంతో పాటు ప్రతియేటా ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని మంత్రిని కోరారు.