ఈహెచ్ఎస్ ఉన్నా.. అందని నగదురహిత వైద్యం
ఉద్యోగులకు నగదురహిత వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈహెచ్ఎస్ కార్డులు చెల్లుబాటు కావడం లేదు. రాష్ట్రంలోని పలు కార్పొరేట్ దవాఖానలు వాటిని ఖాతరు చేయడంలేదు. హైదరాబాద్ మాదాపూర్‌లోని మెడికవర్ దవాఖాన నిర్వాకమే ఇందుకు తాజాగా నిదర్శనం.
- ఆ డబ్బు తిరిగి ఇప్పించాలని రోగి కుటుంబసభ్యుల విన్నపం
- 24 గంటల్లోనే రూ.2.60 లక్షలు వసూలు
- మెడికవర్ దవాఖాన నిర్వాకం
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు నగదురహిత వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈహెచ్ఎస్ కార్డులు చెల్లుబాటు కావడం లేదు. రాష్ట్రంలోని పలు కార్పొరేట్ దవాఖానలు వాటిని ఖాతరు చేయడంలేదు. హైదరాబాద్ మాదాపూర్‌లోని మెడికవర్ దవాఖాన నిర్వాకమే ఇందుకు తాజాగా నిదర్శనం. అత్యవసర వైద్యం కోసం ఆ దవాఖానలో చేరిన ఓ వ్యక్తి నుంచి కేవలం 24 గంటల వ్యవధిలోనే రూ.2.60 లక్షల బిల్లు వసూలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఖాజా ముజీబుద్దీన్‌కు అనారోగ్య సమస్య తలెత్తింది. దీంతో తొలుత ఆయనకు ఆదిలాబాద్‌లోని రిమ్స్ దవాఖానలో చికిత్స అందించారు.
అనంతరం అక్కడి వైద్యులు ముజీబుద్దీన్‌ను హైదరాబాద్‌లోని మెడికవర్ దవాఖానకు రెఫర్ చేశారు. టీచర్‌గా పనిచేస్తున్న ముజీబుద్దీన్ భార్యకు ఈహెచ్ఎస్ కార్డు ఉండటం, ఆ కార్డు చెల్లుబాటయ్యే దవాఖానల జాబితాలో మెడికవర్ హాస్పిటల్ ఉండటంతో నగదు రహిత చికిత్స అందుతుందని భావించి ఆయన ఆ దవాఖానలో చేరారు. దీంతో ముజీబుద్దీన్ ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని, పరిస్థితి సీరియస్‌గా ఉన్నదని, ప్రాణాన్ని కాపాడగలమన్న గ్యారెంటీ ఇవ్వలేమని మెడికవర్ వైద్యులు భయపెట్టడంతోపాటు తమ దవాఖానలో ఈహెచ్ఎస్ వర్తించదని చెప్పారని ఆయన కుటుంబసభ్యులు వాపోయారు.
ముజీబుద్దీన్‌కు అత్యవసర వైద్యం అందాల్సి ఉండటంతో గత్యంతరం లేక అదే దవాఖానలో చికిత్స చేయించామని, దీంతో కేవలం 24 గంటల వ్యవధిలోనే రూ.2.60 లక్షల బిల్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈహెచ్ఎస్ వర్తించకపోవడం, బిల్లు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో ముజీబుద్దీన్‌ను ఒక రోజు వ్యవధిలోనే దవాఖాన నుంచి డిశ్చార్జి చేయాలని కోరినప్పటికీ మొత్తం బిల్లు కట్టించుకున్న తర్వాతే డిశ్చార్జి చేశారని తెలిపారు. ప్రస్తుతం ముజీబుద్దీన్‌ను కరీంనగర్‌లోని ప్రైవేట్ దవాఖానలో చేర్పిం చి చికిత్స చేయిస్తున్నామని, ఆయన ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పారు. ఇప్పటికైనా తమ నగదురహిత వైద్యం అందేలా చూడాలని, మెడికవర్ దవాఖానకు కట్టిన రూ. 2.60 లక్షలు తిరిగి ఇప్పించాలని ఈహెచ్ఎస్ ట్రస్టు బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీఎస్ సంజయ్‌జాజును కోరుతున్నారు.
మెడికవర్ హాస్పిటల్ ముందు నిలబడితే ఎన్కౌంటర్ చేస్తరా?
- పోలీసులను నిలదీసిన ఓ యువకుడు.. వీడియో వైరల్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘మెడికవర్ హాస్పిటల్ ముందు నిలబడితే ఎన్కౌంటర్ చేస్తరా? ప్రైవేట్ హాస్పిటల్ ముందు పోలీసుల కాపలా ఏంది?’ అంటూ ఓ యువకుడు పోలీసులను నిలదీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల చనిపోయిన రెండేండ్ల పాపకు సర్జరీ పేరుతో డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు దవాఖాన వద్ద ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఓ యువకుడు దవాఖాన ముందు నిల్చోగా, అక్కడ మోహరించిన పోలీసులు అతడిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.
మాటా మాటా పెరుగడంతో అక్కడ ఉన్న ఓ వ్యక్తి దవాఖాన ముందు నుంచి వెళ్లకపోతే ఎన్కౌంటర్ చేస్తానని తనను బెదిరించాడని సదరు యువకుడు ఆరోపించాడు. అంతేకాకుండా మెడికవర్ దవాఖాన ముందు నిల్చుంటే ఎన్‌కౌంట్ చేస్తరా? అయినా ప్రైవేట్ హాస్పిటల్ వద్ద పోలీసుల కాపాలా ఏంది? అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డాడు. మీరు ఏదైనా చేయాలనుకుంటే వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటివద్ద చేసుకోండని సమాధానం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కా,గా దీనిపై పోలీసులు, దవాఖాన వర్గాలు మాత్రం స్పందించలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

