Medico Preethi | పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూత.. ఫలించని వైద్యుల ప్రయత్నం..
Medico Preethi | వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన పీజీ విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. నాలుగురోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
Medico Preethi | వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన పీజీ విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. విద్యార్థిని ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్ వైద్యుల ప్రత్యేక బృందం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. రాత్రి 9.10 గంటలకు ప్రీతి మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. బ్రెయిన్ డెడ్‌తో చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రీతి మృతి నేపథ్యంలో నిమ్స్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఆసుపత్రి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీనియర్ వేధింపులను తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. విద్యార్థిని కాకతీయ వైద్యకళాశాలలో పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతున్నది. సీనియర్ విద్యార్థి సైఫ్ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని ఈ నెల 22న ఆమె హానికరమైన ఇంజెక్షన్ చేసుకుని బలవన్మరణానికి యత్నించింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ప్రీతికి తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్ వైద్యుల బృందం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది.
ప్రీతి మృతిపై మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి
వైద్య విద్యార్థిని ప్రీతి మృతికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతిపై సంతాపం తెలిపారు. ప్రీతి మృతి అత్యంత బాధాకరమని, ఆమె ఆరోగ్యంగా తిరిగి వస్తుందని ఆశించామని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రీతి ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

