పాఠశాలల్లో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
పాఠశాలల్లోనే విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి సరికొత్త కార్యక్రమానికి మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ శ్రీకారం చుట్టారు. తూప్రాన్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 241మంది విద్యార్థులకు బుధవారం అక్కడే కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా జారీచేశారు.
- వినూత్న కార్యక్రమానికి మెదక్ కలెక్టర్ శ్రీకారం
- పైలట్ ప్రాజెక్టు కింద తూప్రాన్‌లో ప్రారంభం
తూప్రాన్, ఏప్రిల్ 15 : పాఠశాలల్లోనే విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి సరికొత్త కార్యక్రమానికి మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ శ్రీకారం చుట్టారు. తూప్రాన్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 241మంది విద్యార్థులకు బుధవారం అక్కడే కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా జారీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విద్యార్థులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో బడికి వెళ్లి అధికారులతో కలిసి సర్టిఫికెట్లు జారీచేసినట్టు పేర్కొన్నారు.
ఈ పాఠశాలలో ఉచితంగా జారీచేశామని, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నామమాత్ర రుసుముతో విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తామని తెలిపారు. పదోతరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ధ్రువీకరణ పత్రాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా తూప్రాన్‌లోనే ప్రారంభించినట్టు చెప్పారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈవో తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
Abdul El-Sayed: అమెరికాలో కొత్త చరిత్ర.. తొలి ముస్లిం సేనేటర్గా అబ్దుల్ ఎల్ సయ్యద్ ఎన్నిక
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

