జూరాలకు కొనసాగుతున్న వరద
కొనసాగుతున్న వరద| జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో గేట్ల మరమ్మతు కారణంగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి జూరాల ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరుతున్నది.

మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో గేట్ల మరమ్మతు కారణంగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి జూరాల ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 318.420 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ఉన్నది. నీటి నిల్వ 9.459 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు. కాగా, ఎగువనుంచి 20,239 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 7,484 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఇందులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 5,070 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

