లొంగిపోతే సహకరిస్తాం

- మావోయిస్టులకు సీపీ పిలుపు
పెద్దపల్లిటౌన్, జూన్ 24: అడవి బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టుల పట్ల మానవత్వంతో సహకరిస్తామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శివాలయం వీధీలోని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు ఇంటికి వెళ్లిన సీపీ.. ఆయన తల్లి మల్లోజుల మధురమ్మను కలిసి పండ్లు, దుస్తులు అందజేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాలరావు, మల్లా రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాద్‌రావు తదితర అగ్రనేతలు అనారోగ్యంతో ఉంటే మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. కరోనా బారినపడ్డ వారికి చికిత్స చేయించి, ప్రభుత్వం నుంచి వచ్చే నజరానాలను వారి కుటుంబ సభ్యులకు అందిస్తామన్నారు.
ముంపు భూమి ఇప్పించండి..
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కోల్పోయిన ఎనిమిదెకరాల భూమిని తిరిగి ఇప్పించాలని మల్లోజుల మధురమ్మ సీపీ సత్యనారాయణను కోరారు. కొడుకు వేణుగోపాల్‌రావు ఇంటికి తిరిగి రావాలని వేడుకుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

