మా కల్లాల్లో మీకేం పని?
మంచిర్యాల జిల్లా చెన్నూర్ శివారులో మిర్చి తోటల పరిశీలన పేరుతో వస్తున్న బీజేపీ నాయకులను రైతులు అడ్డుకొన్నారు. తమ కల్లాల్లోకి రావొద్దంటూ హెచ్చరించారు. ఏం ఉద్ధరించడానికి వచ్చారంటూ కమలం పార్టీ నాయకులపై తిరగబడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమను పావులుగా వాడుకొంటే సహించబోమని స్పష్టంచేశారు.
- బీజేపీ నాయకులను అడ్డుకొన్న మిర్చి రైతులు
- తోటల పరిశీలన పేరిట కమలం పార్టీ రాజకీయం
- రైతులు మర్లబడటంతో తోక ముడిచిన నేతలు
మంచిర్యాల, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): మంచిర్యాల జిల్లా చెన్నూర్ శివారులో మిర్చి తోటల పరిశీలన పేరుతో వస్తున్న బీజేపీ నాయకులను రైతులు అడ్డుకొన్నారు. తమ కల్లాల్లోకి రావొద్దంటూ హెచ్చరించారు. ఏం ఉద్ధరించడానికి వచ్చారంటూ కమలం పార్టీ నాయకులపై తిరగబడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమను పావులుగా వాడుకొంటే సహించబోమని స్పష్టంచేశారు. బీజేపీ నాయకులకు మద్దతుగా అక్కడికి వచ్చిన మాజీ ఎంపీ వివేక్ వెంకట్స్వామిపైనా మర్లబడ్డారు.
‘మా పొలాల్లో మీకేం పని?’ అంటూ నిలదీశారు. చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వస్తే రైతులకు లాభమే కదా.. దానిపై మీ రాజకీయం ఏంది?, మేము బాగుపడటం మీకు ఇష్టం లేదా అని రైతన్నలు బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగారు. ఊహించని రీతిలో అన్నదాతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవ్వడంతో బీజేపీ నాయకులు, వివేక్ వెంకటస్వామి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. కాగా, రైతులు తిరగబడితే టీఆర్ఎస్ నాయకులు దాడిచేశారంటూ బీజేపీ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రైతులపై బీజేపీ నాయకుల దాడిని ఖండించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- Chennur town
- mancherial
- TRS
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

