యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
KNRUHS | యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం మరోసారి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కలిపిస్తూ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. యాజమాన్య కోటా
వరంగల్ : యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం మరోసారి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కలిపిస్తూ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు యూనివర్సిటీ, ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఖాళీ సీట్లకు ఇప్పటికే ఉన్న ప్రవేశాల జీవోను సడలిస్తూ ఈ ఒక్క ఏడాది రిజిస్ట్రేషన్‌కు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు రిజిస్ట్రేషన్‌కు ప్రకటన విడుదల చేసింది.
అభ్యర్థులు నేరుగా ఈ నెల 17 వ తేదీన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని హెల్ప్ లైన్ సెంటర్లో ఉదయం 9 గంటల నుండి సాయింత్రం 4 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావలసి ఉంటుంది. నిబంధనలు పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

