బలికోరిన ప్రేమోన్మాది!
ప్రేమించి పెండ్లి చేసుకున్న యువతి దక్కలేదనే అక్కసుతో ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. వేట కొడవలితో యువతి తల్లిదండ్రులపై దాడి చేసి హతమార్చాడు.
- వేటకొడవలితో యువతి తల్లిదండ్రులపై దాడి
- తీవ్ర గాయాలతో స్పాట్లోనే తల్లి మృతి
- దవాఖానలో చికిత్స పొందుతూ తండ్రి మృతి
- అడ్డొచ్చిన యువతి, ఆమె తమ్ముడికి గాయాలు
- పెండ్లి చేసుకున్న యువతి దక్కలేదని ఘాతుకం
- నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్న మంత్రి సీతక్క
చెన్నారావుపేట/నర్సంపేట/హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ప్రేమించి పెండ్లి చేసుకున్న యువతి దక్కలేదనే అక్కసుతో ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. వేట కొడవలితో యువతి తల్లిదండ్రులపై దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతలతండాలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.
తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్(40), సుగుణ (35) దంపతులకు కుమార్తె దీపిక, కుమారుడు మదన్‌లాల్ ఉన్నారు. దీపిక అమినాబాద్ మాడల్ స్కూల్లో చదువుతుండగా గూడూరు మండలం గుండెంగకు చెందిన ఆటో డ్రైవర్ బన్ని అలియాస్ నాగరాజు రోజూ ఆమెను తీసుకెళ్లేవాడు. దీంతో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
యువతి ఇంటర్ తర్వాత హనుమకొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నది. ఈ సమయంలో నాగరాజు మాయమాటలు నమ్మి పెద్దలకు తెలియకుండా 6 నెలల క్రితం పెండ్లి చేసుకున్నది. అప్పటికీ దీపిక మైనర్. తమ కూతురికి మాయమాటలు చెప్పి నాగరాజు పెండ్లి చేసుకున్నాడని దీపిక తల్లిదండ్రులు చెన్నారావుపేట పోలీస్ స్టేషన్లో కేసుపెట్టారు.
విచారణ చేసిన పోలీసులు దీపిక మైనర్ కావడంతో కౌన్సెలింగ్ నిర్వహించి.. ఆమె అనుమతితో పెద్దల సమక్షంలో విడాకులు ఇప్పించారు. దీంతో కక్ష పెంచుకున్న నాగరాజు.. వారిని చంపాలనుకుని యువతి గ్రామంలో రెక్కీ నిర్వహించాడు. బుధవారం అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న దీపిక తల్లిదండ్రులపై కొడవలితో దాడి చేశాడు.
అడ్డొచ్చిన దీపికతోపాటు ఆమె తమ్ముడు మదన్‌లాల్‌పై దాడి చేశాడు. దీపిక తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి దవాఖానలో మృతి చెందాడు. గాయపడిన యువతిని, ఆమె సోదరున్ని వరంగల్ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నర్సంపేట వైద్యశాలకు తరలించారు.
నిందితుడికి కఠిన శిక్ష : మంత్రి సీతక్క
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. గాయపడిన యువతి, ఆమె సోదరుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు.
మృతుల కుటుంబానికి న్యాయం చేయాలి: పెద్ది సుదర్శన్
సుగుణ, శ్రీనివాస్ మృతదేహాలతో బంధువులు, బీఆర్ఎస్ నాయకులు గురువారం నర్సంపేట పోలీస్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. ఉన్మాదిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేసే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైటాయించారు. గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. నర్సంపేటలోనూ ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళన చేపట్టారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మద్దతు తెలిపారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డీజీపీ జితేందర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇద్దరు పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, పిల్లల రక్షణ ప్రభుత్వమే తీసుకోవాలని, రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

