Heart Attack | జగిత్యాల, జూన్ 2: షటిల్ ఆడుతూ ఓ వ్యక్తి గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. తోటి వారు గమనించి దవాఖానకు తరలించేలోపే ప్రాణాలోదిలాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాలలో శుక్రవారం జరిగింది. జగిత్యాలకు చెందిన బూస వెంకట రాజ గంగారాం (54) రోజుమాదిరిగానే షటిల్ ఆడేందుకు స్థానిక క్లబ్ గ్రౌండ్‌కు వెళ్లాడు.
ఉదయం వాకింగ్ చేసి తోటి మిత్రులతో షటిల్ ఆడుతుండగా ఒంట్లో నలతగా ఉన్నదని చెబు తూ కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు సీపీఆర్ చేసి దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.