మహిళా ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డిలకు అవమానం కాంగ్రెస్ సరార్కు సిగ్గుచేటు. అసెంబ్లీ సాక్షిగా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. మహిళల అభ్యున్నతికి తోడ్పడుతున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. మహిళలపై వ్యవహరించిన తీరు.. కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు నిదర్శనం.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేని చేతగాని ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూస్తున్నది. పాలన చేతగాని అసమర్థ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధిచెబుతారు. మహిళల ఉసురు తగిలి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతుంది.
– మాలోత్ కవిత, మాజీ ఎంపీ