Mallu Bhatti Vikramarka | డీఎస్సీ వాయిదా వేయబోం.. నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు: డిప్యూటీ సీఎం
డీఎస్సీని వాయిదా వేయాలంటూ విద్యార్థులు విజ్ఞప్తులు, ధర్నాలు చేస్తున్నారని, అయితే పరీక్ష వాయిదా వేసేదే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.
- త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం
- 5-6 వేల పోస్టులతో త్వరలో మరో నోటిఫికేషన్
- స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Mallu Bhatti Vikramarka | హైదరాబాద్, జులై 14(నమస్తే తెలంగాణ): డీఎస్సీని వాయిదా వేయాలంటూ విద్యార్థులు విజ్ఞప్తులు, ధర్నాలు చేస్తున్నారని, అయితే పరీక్ష వాయిదా వేసేదే లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. విద్యార్థులు పరీక్షలు రాయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ నెల 18 నుంచి నిర్వహించే పరీక్షలకు హాజరై, సెలక్ట్ కావాలని సూచించారు. ఇదే చివరి డీఎస్సీ కాదని, ఇందులో సెలక్ట్ కాకపోతే మరో డీఎస్సీ వస్తుందని అన్నారు.
ఈ మేరకు డీఎస్సీ వాయిదా వేయాలంటూ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనపై స్పందించిన ఆయన.. ఆదివారం గాంధీభవన్‌లో మాట్లాడారు. నోటిఫికేషన్ ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 16 వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం 5 వేల టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌కు మరో 6వేల పోస్టులను జోడించి తమ ప్రభుత్వం మొత్తం 11 వేల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసిందని వివరించారు.
మిగిలిన 5-6 వేల పోస్టులతో కొద్ది నెలల్లోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నిరుద్యోగలు సమస్యపై దృష్టి పెట్టామని, ఇందులో భాగంగానే 3 నెలల్లోనే 30 వేల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామని తెలిపారు.
చెప్పినట్లుగానే సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి పూర్తిస్థాయిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను ప్రారంభించినట్టు వివరించారు. ఇప్పటికే 13,321 పోస్టుల భర్తీకి సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టిందని అన్నారు. గత ప్రభుత్వం పరీక్షల వాయిదాతో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

