Etala Rajender | కొడుకా బీ కేర్ ఫుల్.. బండి సంజయ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈటెల రాజేందర్
Etala Rajender | కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వివాదం ముదురుతోంది. ఈటెల వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనంటూ బండి సంజయ్ పరోక్షంగా హెచ్చరించిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు.
Etala Rajender | హైదరాబాద్ : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వివాదం ముదురుతోంది. ఈటెల వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనంటూ బండి సంజయ్ పరోక్షంగా హెచ్చరించిన వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. శామీర్‌పేట్‌లోని తన నివాసంలో ముఖ్య నేతలతో ఈటెల సమావేశమై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. అనంతరం ఈటెల రాజేందర్ బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ.. బహిరంగంగా మాట్లాడారు.
స్ట్రెయిట్ ఫైట్ చేస్తా నీలాగా స్ట్రీట్ ఫైట్ చేయను అని బండి సంజయ్‌ను ఉద్దేశించి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ధీరునితో కొట్లాడుతం తప్ప.. కుట్రగాళ్లతో కొట్లాడేటోళం కాదు. ఈ కుట్రలను, కుతంత్రాలను చేసే వారి సంగతి తేల్చాల్సిన శక్తి ప్రజలకు మాత్రమే ఉంటది. రేపటి గెలుపునకు సంకేతమిచ్చే అడ్డా శామీర్‌పేట అడ్డా. వాడెవడో సైకోనా, శాడిస్టా, మనిషా, పశువా. వాడు ఏ పార్టీలో ఉన్నాడు. వాడు ఎవని అండతో ధైర్యం చేస్తున్నడు. కొడుకా బీ కేర్ ఫుల్ అని బండి సంజయ్‌ను ఈటెల రాజేందర్ హెచ్చరించారు.
మేం శత్రువులతో కొట్లాడుతాం. కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే సంస్కృతి నా రక్తంలో లేదు కొడుకా. ఇవాళ ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, రెచ్చగొడుతున్నారో వారి వివరాలను పైకి పంపించే ప్రయత్నం చేస్తాను. నీ శక్తి ఏంది..? నీ యుక్తి ఏంది..? నీ చరిత్ర ఏంది..? మా చరిత్ర ఏందో తెలుసా..? 2002లో వచ్చాడు ఆ జిల్లాకు. నేను రెండు సార్లు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశాను. రెండుసార్లు జిల్లా మంత్రిగా పని చేశాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాల్లేవు. ఒక్క హుజురాబాద్, కమలాపూర్‌కే పరిమితం కాదు బిడ్డా.. కరీంనగర్ జిల్లా మొత్తం నా వెంబడి వచ్చేది. నా చరిత్ర నీకు చాలా తక్కువ తెలుసు కొడుకా అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
మళ్లీ చెబుతున్నా.. హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊరిలో మన వార్డు మెంబర్, నా సర్పంచ్ ఉంటడు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎంపీకి కూడా అన్ని ఓట్లు వేయించాను. ఈ విషయం ఆయన అంతరాత్మకు తెలుసు. 2014 వరకు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు కలిపే వచ్చాయి. 2019లో ఆనాడు నువ్వు కరీంనగర్ ఎంపీగా గెలిచినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీకి 53 వేలు మెజారిటీ వచ్చింది. కేసీఆర్, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడినవాడిని.. బండి సంజయ్ లాంటి వాడితో కొట్లాడితే నా పతార ఏం కావాలి అని ఈటెల రాజేందర్ అన్నారు.
బీ కేర్ ఫుల్ కొడకా
బండి సంజయ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఈటెల రాజేందర్
నేను శత్రువుతో కోట్లాడుతా
కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోను నా కొడకా – ఈటల రాజేందర్ https://t.co/UHSgLItyMF pic.twitter.com/6ettOD6WRb
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

