శనివారం 11 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 13:17:45

సీఎం కేసీఆర్‌ కలను సాకారం చేద్దాం : ఎంపీ సంతోష్‌కుమార్‌

సీఎం కేసీఆర్‌ కలను సాకారం చేద్దాం : ఎంపీ సంతోష్‌కుమార్‌

హైదరాబాద్‌ : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 6వ విడత హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగుతుంది. సీఎం కేసీఆర్‌ హరితహారానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రం మొత్తం పచ్చదనంగా ఉండాలన్నదే సీఎం ఆశయం. సీఎం కేసీఆర్‌ కల సాకారం చేసేందుకు అందరం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాల్సిందిగా ఎంపీ సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. నేటి హరితహారంలో ఎంపీ పాల్గొని మొక్క నాటారు. ప్రతీ మొక్క లేక్కే అని అన్నారు.


logo