CMO | త్వరలో సీఎంవోలో మార్పులు?.. సగంమంది అధికారులకు ఉద్వాసన
ముఖ్యమంత్రి కార్యాలయంలో త్వరలో భారీ మార్పులు జరుగబోతున్నట్టు సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. సగానికిపైగా అధికారులను మార్చుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్రెడ్డి సీఎంగా అధికారం చేపట్టగానే సీనియర్ అధికారి శేషాద్రిని సీఎంవో ముఖ్యకార్యదర్శిగా నియమించారు.
- పీఎంవో నుంచి శేషాద్రికి పిలుపు!
- రేవంత్కు కావాల్సిన వ్యక్తులు సీఎంవోలోకి
CMO | హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కార్యాలయంలో త్వరలో భారీ మార్పులు జరుగబోతున్నట్టు సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. సగానికిపైగా అధికారులను మార్చుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్రెడ్డి సీఎంగా అధికారం చేపట్టగానే సీనియర్ అధికారి శేషాద్రిని సీఎంవో ముఖ్యకార్యదర్శిగా నియమించారు. మిగతా బృందాన్ని సైతం ఏరికోరి ఎంచుకున్నారు. ఒకరిద్దరు రాజకీయ కారణాల రీత్యా వచ్చినట్టు అప్పట్లోనే ప్రచారం జరిగింది. తాను అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదని, కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో సరైన మార్గనిర్దేశనం చేయడం లేదని సీఎం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా గత నెల 18న క్యాబినెట్ సమావేశం విషయంలో జరిగిన రచ్చ దీనికి ఆజ్యం పోసిందని చెప్పుకుంటున్నారు. ఎన్నికల సంఘం అనుమతి లేకపోవడంతో క్యాబినెట్ సమావేశం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా క్యాబినెట్ సమావేశం నిర్వహించవచ్చా? లేదా? ఎజెండాలో ఎలాంటి అంశాలు ఉంటే ఈసీ సులభంగా అనుమతి ఇస్తుంది? వంటి ప్రాథమిక అంశాలపై కూడా సరైన అవగాహన లేకపోతే ఎలా అని సీఎం, మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
తాజాగా విద్యాశాఖలో జరిగిన ‘పుస్తకాలు వెనక్కి’ వ్యవహారం సెగలు సైతం సీఎంవో వరకు తాకాయని చర్చ జరుగుతున్నది. మరోవైపు సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రికి కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చినట్టు చెప్తున్నారు. గతంలో ఆయన పీఎంవోలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనను మరోసారి పీఎంవోలోకి రావాలని కోరినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎంవోలో ప్రక్షాళన చేయాలని సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. త్వరలో వివిధ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను మారుస్తారని సమాచారం. ఇప్పటికే ఫైల్ సీఎం దగ్గరికి చేరిందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగానే సీఎంవో నుంచి ఇద్దరు ముగ్గురిని బయటికి పంపి, ఆ స్థానంలోకి తనకు కావాల్సిన వ్యక్తులను తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

