Maharashtra farmers | మహారాష్ట్రలో రైతుల మృత్యుఘోష.. 10 నెలల్లో 2,366 మంది బలవన్మరణం
మహారాష్ట్రలో ప్రభుత్వాలు మారినా రైతుల వెతలు మాత్రం తీరటం లేదు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే మన రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
- ప్రభుత్వాలు మారినా తీరని అన్నదాతల వెతలు
- 67 కుటుంబాలకు పరిహారం పొందే అర్హత లేదన్న అధికారులు!
Maharashtra farmers | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో ప్రభుత్వాలు మారినా రైతుల వెతలు మాత్రం తీరటం లేదు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే మన రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది 10 నెలల్లో మహారాష్ట్రలో 2,366 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ రాష్ట్ర మంత్రి అనిల్ భాయిదాస్ పాటిల్ స్వయంగా అసెంబ్లీకి నివేదించారు. అత్యధికంగా అమరావతి రెవిన్యూ డివిజన్లో 951 మంది రైతులు మరణించారని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ పాటిల్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరుకు ప్రభుత్వానికి అందిన నివేదికల ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 2.366 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అందులో ఛత్రపతి శంభాజీనగర్ డివిజన్లో 877 మంది, నాగపూర్ డివిజన్లో 257 మంది, నాసిక్ డివిజన్లో 254 మంది, పుణే డివిజన్లో 27 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష చొప్పున సాయం అందించినట్టు చెప్పారు.
ఆదుకోవడంలో మీనమేషాలు
మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ప్రతిపక్షాలు, రైతు సంక్షేమ సంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతున్నదని, నిర్దయగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు ఆరోపించారు. గత జనవరి నుంచి జూన్ మధ్య మరాఠ్వాడాలో 483 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయని.. వాస్తవానికి ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని రైతు సంఘాలు చెబుతున్నాయి. మరణించిన రైతుల్లో 67 మంది కుటుంబాలు ఎక్స్‌గ్రేషియాకు అర్హత లేవని అధికారులు తేల్చారని ఆరోపించాయి. రూ.1 లక్ష పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. వాస్తవానికి రూ.30 వేలు మాత్రమే నగదు రూపంలో ఇస్తున్నారని, మిగతా రూ.70 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి భవిష్యత్తులో క్లెయిమ్ చేసుకునేలా చేశారని తెలిపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

