MLC By Election | మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం..
రెండు నెలలకుపైగా సుదీర్ఘ నిరీక్షను నేటితో తెరపడనుంది. 66 రోజుల తర్వాత మరికొన్ని గంటల్లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం (MLC By Election) తేలనుంది. జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
మహబూబ్‌నగర్: రెండు నెలలకుపైగా సుదీర్ఘ నిరీక్షను నేటితో తెరపడనుంది. 66 రోజుల తర్వాత మరికొన్ని గంటల్లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఫలితం (MLC By Election) తేలనుంది. జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను లెక్కిస్తున్నారు. సాయంత్రానికి ఫలితం తేలే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి అ సెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారడం.. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున నవీన్‌కుమార్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
ప్రాధాన్యతా క్రమంలో..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యతా క్రమంలో ఓటర్లు ఓటేస్తారు. అందుకే కౌంటింగ్‌లో భాగంగా మొదట ప్రారంభ లెక్కింపు చేపడుతారు. కౌంటింగ్ కోసం ఐదు టేబుళ్లను ఏ ర్పాటు చేశారు. ప్రారంభం లెక్కింపులో మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను, వచ్చిన బ్యాలెట్ పేపర్లను లెక్కిస్తారు. అనంతరం మొత్తం చెల్లుబాటైన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపు కోసం కావాల్సిన కోటాను నిర్ధారిస్తారు. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొ దటి ప్రాధాన్యత ప్రకారం ప్రతి అభ్యర్థి సాధించిన ఓట్లను లె క్కించి, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఎవరైనా అభ్యర్థి కోటాకు సరిపడా ఓట్లను సాధిస్తే అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు.
ఏ అభ్యర్థి కోటాకు కావాల్సిన ఓట్లు రాకుంటే ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి తదుపరి ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ ఏదేని అభ్యర్థి కోటాను సాధించేవరకు చేపడతారు. ఏ అభ్యర్థికీ కోటా రానట్లయితే చివరికి మిగిలిన అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. శాసనమండలి ఉపఎన్నిక కాంగ్రెస్‌కు పరీక్షగా మారింది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నిక కావడంతో అందులో సీఎం సొంత జిల్లా కావడం ఆ పార్టీకి సవాల్‌గా మారిందని చెప్పొచ్చు. అయితే స్థానిక ప్రజాప్రతినిధుల సంఖ్యాబలంలో మాత్రం కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప క్షం మొత్తం స్థానిక ప్రజాప్రతినిధులను ప్రలోభపట్టే కార్యక్రమంలో మునిగిపోయిందన్న సమాచారం. దీనికి తగ్గట్టు ఆ పార్టీ ప్రముఖ వ్యాపారవేత్తను అభ్యర్థిగా ప్రకటించింది. రూ. కోట్లు ఖర్చు పెట్టయినా ఎమ్మెల్సీగా గెలవాలన్న లక్ష్యంతో పని చేశారన్న విమర్శలున్నాయి. ఆ పార్టీ క్యాండిడేట్ స్థానిక ప్రజాప్రతినిధులను ఇతర రాష్ర్టాల్లో విహారయాత్రలకు తీసుకెళ్లి రూ.లక్షల ఖర్చు పెట్టినట్లు తెలిసింది. కాగా, ఉన్న ఓట్లలో చా లామంది క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో ఆ పార్టీకి గెలుపుపై అవకాశాలు సన్నగిల్లాయి. చివరివరకు ప్రయత్నాలు చే సినా ఏం జరుగుతుందో కౌంటింగ్ తర్వాతే తేలనున్నది.
బీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల్లో మలుపు
మహబూబ్‌నగర్ శాసనమండలి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్‌రెడ్డి గెలిస్తే రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం పడనున్నది. సీఎం సొంత జిల్లాలో బలమైన అభ్యర్థిని ఓడించిన ఘనత గులాబీ పార్టీకే దక్కుతుంది. అధికారం కోల్పోయి.. కొన్నాళ్లకు అదే పార్టీ నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేసే ఎన్నిక కావడంతో గ్రామస్థాయిలో ప్రభావం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. ఇతర కారణాలతో కాంగ్రెస్ ఓడిపోతే రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే అదునుగా సీఎం పీఠం కదిలి అభ్య ర్థి మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

