మండలిలో బీఆర్ఎస్ పక్షనేతగా మధుసూదనాచారి
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి నియమితులయ్యారు.
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి నియమితులయ్యారు. అనంతరం మండలిలో తనను బీఆర్ఎస్ పక్ష నేతగా నియమించిన పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావును మధుసూదనాచారి కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన మధుసూదనాచారి తొలి తెలంగాణ శాసనసభాపతిగా పనిచేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత అయిన మధుసూదనాచారి తెలంగాణ ఉద్యమకారుడిగా, బహుజన పక్ష నేతగా గుర్తింపు ఉన్నది. సుదీర్ఘ పోరాట అనుభవం, అపారమైన జ్ఞానం, సామాజిక విజ్ఞత కలిగిన మధుసూదనాచారి మరిన్ని విజయాలు సాధించాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్‌కుమార్ గురువారం ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజల గొంతుకగా, తెలంగాణ అభివృద్ధికి తోడ్పడే చోదకశక్తిగా ముందుకు సాగాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

