గ్యాస్ సిలిండర్ ఇప్పిస్తానని తీసుకెళ్లి.. ఇల్లు గుల్ల
గ్యాస్ సిలిండర్ వచ్చిందని ఓ మహిళను ఇంటి నుంచి తీసుకెళ్లాడు ఓ ఆగంతకుడు. ఆమెను ఓ చోట ఉంచి మరో మహిళను తీసుకొస్తానని చెప్పి ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాలు చోరీ చేశాడు.
- ఇంట్లో చొరబడి నాలుగు తులాల బంగారం అపహరణ
- హుజూరాబాద్ మండలం కందుగులలో ఘటన
హుజూరాబాద్ రూరల్, మార్చి 31 : గ్యాస్ సిలిండర్ వచ్చిందని ఓ మహిళను ఇంటి నుంచి తీసుకెళ్లాడు ఓ ఆగంతకుడు. ఆమెను ఓ చోట ఉంచి మరో మహిళను తీసుకొస్తానని చెప్పి ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. ఈ ఘటన హుజూరాబాద్ మండలం కందుగులలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుడిపాటి ఆగమ్మ ఒంటరిగా ఉంటున్నది.
సోమవారం ఉదయం ఆరుబయట దుస్తులు ఉతుకుతుండగా గుర్తుతెలియని వ్యక్తి బైక్పై వచ్చి గ్యాస్ సిలిండర్ వచ్చిందని, సంతకం చేసి తీసుకోవాలని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి తన కొడుకు 4 రోజుల క్రితమే గ్యాస్ తెచ్చాడని చెప్పింది.
‘మీ కొడుకే చెప్పాడు’ అని చెప్పి ఆమెను బైక్పై ఎక్కించుకొని గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. అక్కడ దింపి, మరో మహిళను తీసుకువస్తానని చెప్పి వెళ్లాడు. ఎంతకూ రాకపోవడంతో ఆగమ్మ నడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా మంచం దిండుకింద దాచిన సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారికి చెప్పింది. గ్యాస్ వచ్చిందని చెప్పి సదరు వ్యక్తి మోసం చేశాడని గుర్తించి హుజూరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టౌన్ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

