హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ క్రీడా కోటా నియామకాలపై లోకాయుక్త సీరియస్ అయ్యింది. బుధవారం నాటి విచారణకు అధికారులు గైర్హాజరు కావడాన్ని సీరియస్గా తీసుకుంది. రెండు వారాల్లోపు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అక్టోబర్ 8న పూరి ్తవిచారణకు సిద్ధంగా ఉండాలని లోకాయుక్త నోటీసులు జారీచేసింది. డీఎస్సీ సెకండరీ గ్రేడ్టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా క్రీడా కోటా నియామకాల స్కాంపై లో కాయుక్త బుధవారం విచారణ జరిపింది. ఐదుగురు అధికారులు విచారణకు హాజరుకావాల్సి ఉండగా, స్పోర్ట్స్ అథారిటీ, విద్యాశాఖ అధికారులెవరు ఈ విచారణకు హాజరుకాలేదు. పిటిషనర్ మాత్రమే హాజరయ్యారు. ఇదే విషయంపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాలపై లోకాయుక్త పిటిషన్ను ఆరా తీసింది. దీనిని సీరియస్గా తీసుకున్న లోకాయుక్త రెండు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీపై అటు విద్యాశాఖకు, ఇటు స్పోర్ట్స్ అథారిటీకి అస్సలు పొసగడంలేదు. రెండుశాఖలు రెండు రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి.