Tribal University | ములుగు సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి లోక్‌సభ ఆమోదం
Tribal University | ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది.
Tribal University | ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం-2009ను సవరించింది. యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే రూ.889.7 కోట్లను బడ్జెట్లో కేటాయించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుతో రాబోయే రోజుల్లో స్థానికుల ఆకాంక్షలను నెరవేర్చగలదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఉన్నత విద్య, పరిశోధనా సౌకర్యాలను సులభతరం చేయడంతో పాటు ప్రోత్సహిస్తుందన్నారు. గిరిజన విద్యపై దృష్టి పెట్టడమే కాకుండా.. సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఇతర సెంట్రల్ యూనివర్శిటీల మాదిరిగానే విద్య, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తుందని మంత్రి పేర్కొన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం.. తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్రం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

