Nizamabad | సైబర్‌క్రైమ్ పోలీసు కస్టడీలో నిందితుడు మృతి.. నిజామాబాద్‌లో ఘటన
నిజామాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు మరణించడం కలకలం సృష్టించింది. విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్న నిందితుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా పోలీసులు వర్గాలు తెలిపాయి. అయితే పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే మరణించాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసుల వేధింపుల వల్లే మరణించాడని మృతుని కుటుంబ సభ్యుల ఆందోళన
వినాయక నగర్, మార్చి 14: నిజామాబాద్ (Nizamabad) సైబర్‌క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు మరణించడం కలకలం సృష్టించింది. విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్న నిందితుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా పోలీసులు వర్గాలు తెలిపాయి. అయితే పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే మరణించాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లాకు చెందిన సంపత్ అనే యువకుడు శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతని ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయిన ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంపత్‌తోపాటు మరో ఏజెంట్‌పై పది రోజుల క్రితం కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

అయితే బాధితుల డబ్బులు రికవరీ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ నిమిత్తం రెండు రోజుల క్రితం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు. విచారణలో భాగంగా గురువారం మధ్యాహ్నం సంపత్‌ను తన స్వస్థలమైన జగిత్యాలకు తీసుకువెళ్లారు. గురువారం రాత్రి 9.45 నిమిషాలకు తిరిగి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కొద్ది సేపటికే తన చెయ్యి నొప్పిగా ఉందని నిందితుడు చెప్పడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడికి వెళ్లిన కొద్ది సమయానికి సంపత్ మరణించాడు. దీంతో పోలీసులు విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
శుక్రవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. పోలీసుల టార్చర్ వల్లే సంపత్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంపత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో హాస్పిటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనపై విచారణ నిర్వహించేందుకు మేజిస్ట్రేట్ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి రానున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

