Runa Mafi | మాఫీపై ఫిర్యాదుల వెల్లువ.. ఏఈవోల వద్దకు రైతుల పరుగులు
రూ.లక్షలోపు రుణమాఫీ అమలవుతున్న తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తొలి జాబితాను చూసిన తరువాత రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రూ.లక్షలోపు రుణమే ఉన్నప్పటికీ తమ పేర్లు జాబితాలో కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
- బ్యాంకుల వద్ద బారులు
- డీసీసీబీ, ప్యాక్స్ల్లో సగం మందికే రుణమాఫీ
Runa Mafi | హైదరాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ): రూ.లక్షలోపు రుణమాఫీ అమలవుతున్న తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తొలి జాబితాను చూసిన తరువాత రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రూ.లక్షలోపు రుణమే ఉన్నప్పటికీ తమ పేర్లు జాబితాలో కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జాబితాలో పేర్లు ఉన్నవారికి కూడా సంపూర్ణంగా మాఫీ కాలేదని, అరకొరగానే మాఫీ అయిందని రైతులు చెప్తున్నారు.
మండల, జిల్లా స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫిర్యాదు సెంటర్లకు, ఏఈవోలకు రైతుల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. తమ కు రుణమాఫీ అయిందో, లేదో తెలుసుకునేందుకు బ్యాంకుల ముందు రైతులు బారులు తీరుతున్నారు. అక్కడ అధికారుల నుంచి సరైన సమాచారం లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
డీసీసీబీల్లో రుణమాఫీ సమస్య మరింత ఎక్కువగా ఉన్నదని రైతులు చెప్తున్నారు. రూ.లక్ష వరకు రుణమాఫీ కావాల్సిన వారిలో సగం మందికి కూడా మాఫీ కావడం లేదని, భారీ సంఖ్యలో రైతుల పేర్లు గల్లంతవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రుణమాఫీలో చిత్రవిచిత్రాలు
రుణమాఫీలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తొలి జాబితాలో రుణం మాఫీ అయిన రైతులకు కూడా మొత్తం రుణం నిధులు ఖాతాలో జమ కావడం లేదు. ఉదాహరణకు ఒక రైతుకు అసలు, వడ్డీతో కలిసి రూ.70 వేల రుణం ఉంటే.. మొత్తం రూ.70 వేలు మాఫీ కింద రైతు ఖాతాలో జమ కావాలి. కానీ విచిత్రంగా ఆ రైతు ఖాతాల్లో రూ. 20 వేలే జమవుతున్నాయి. చాలా బ్యాంకుల్లో ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతున్నది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ బ్యాంకుల్లో చాలామంది రైతులకు మాఫీ మొత్తంతో పోల్చితే తక్కువ నిధులు ఖాతాలో జమవుతున్నాయి. అయితే దీనికి కారణం అధికారులు కూడా చెప్పకపోవడం గమనార్హం. ఇలాంటివి బ్యాంకుల తప్పిదాల వల్లే జరిగాయని, నిధులు జమ చేయడంలో ఎలాంటి పొరపాటు లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు.
- నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ.లక్ష వరకు రుణం మాఫీ కావాల్సి ఉన్న రైతుల ఖాతాల్లో రూ.30 వేలు, రూ.40 వేలు, రూ.60 వేలు మాత్రమే జమయ్యాయి.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సొసైటీలో రూ.లక్ష వరకు రుణమాఫీ కావాల్సిన రైతులు 2,500 మంది ఉంటే 500 మందికి మాత్రమే మాఫీ అయింది. గుంపెన సొసైటీలో 1,800 మంది రైతులకుగాను 300 మందికి మాత్రమే రుణమాఫీ అయింది.
- జనగామలో తిరుపతి అనే రైతుకు వడ్డీతో కలిపి రూ.86 వేల రుణం ఉంటే ఆ రైతు ఖాతాలో రూ.13,497 మాత్రమే జమయ్యాయి.
- రంగారెడ్డి జిల్లా డీసీసీబీ పరిధిలో రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులు సుమారు 34 వేల వరకు ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో 11,700 మంది పేర్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన 22 వేల మంది రైతుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Congress govt
- dccb
- Loan Waiver
- PAX
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

