Kaleshwaram Project | కాళేశ్వరం కాలువలు కళకళ.. ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరద కాలువకు పరుగులు
కాళేశ్వరం లింక్-2లో పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్ నుంచి నంది పంప్‌హౌస్ మీదుగా ఎగువకు గోదావరి పరవళ్లు పెడుతున్నది. ధర్మారం మండలం నందిమేడారం నంది పంప్‌హౌస్‌లో ఫిబ్రవరి 27న 4, 5 మోటర్లను ఆన్ చేసి జలాలను తరలించిన అధికారులు, విడతల వారీగా మోటర్లను ప్రారంభిస్తూ నీటిని ఎత్తిపోస్తున్నారు.
- ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీ వరద కాలువకు పరుగులు
- జగిత్యాల జిల్లా రాంపూర్పంప్హౌస్లో ఎత్తిపోతలు
ధర్మారం/రామడుగు/మల్యాల, ఫిబ్రవరి 28: కాళేశ్వరం లింక్-2లో పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్ నుంచి నంది పంప్‌హౌస్ మీదుగా ఎగువకు గోదావరి పరవళ్లు పెడుతున్నది. ధర్మారం మండలం నందిమేడారం నంది పంప్‌హౌస్‌లో ఫిబ్రవరి 27న 4, 5 మోటర్లను ఆన్ చేసి జలాలను తరలించిన అధికారులు, విడతల వారీగా మోటర్లను ప్రారంభిస్తూ నీటిని ఎత్తిపోస్తున్నారు. శనివారం 2,5వ మోటర్లను ఆన్ చేయగా 6,300 క్యూసెక్కులు డెలివరీ సిస్టర్న్‌ల ద్వారా నంది రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి.
అండర్ టన్నెళ్ల ద్వారా అదే పరిమాణంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంప్ హౌస్‌కు తరలిపోతున్నాయి. 1, 7వ నంబర్ మోటర్లను ప్రారంభించి ఎత్తిపోతలు కొనసాగించారు. డెలివరీ సిస్టర్న్ నుంచి ఎగిసిపడుతున్న జలాలు గ్రావిటీ కెనాల్ ద్వారా ప్రవహించి ఎస్సారెస్పీ వరదకాలువ 102 కిలోమీటర్ పాయింట్ వద్ద కలుస్తున్నాయి.
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఇక్కడి గేట్లను మూసి నీటిని ఎగువకు తరలిస్తున్నారు. శుక్రవారం 0.15 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని, శనివారం 0.30 టీఎంసీల జలాలను తరలించామని వెల్లడించారు. గాయత్రీ పంప్‌హౌస్ నుంచి తరలివచ్చిన 6,300 క్యూసెక్కుల జలాలు వరద కాలువలో ఎదురెక్కుతూ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మించిన రాంపూర్ పంప్‌హౌస్‌కు చేరాయి. ఇక్కడ 3 మోటర్లను ఆన్ చేసి ఒక్కో మోటర్ ద్వారా 1,450 క్యూసెక్కుల చొప్పున 4,350 క్యూసెక్కులు వరదకాలువలో ఎగువకు పంపింగ్ చేశారు. సాయంత్రం ఎత్తిపోతలు నిలిపివేశారు. వరద కాలువపై ఆధారపడి సాగైన పంటలకు నీరందించేందుకే ఎత్తిపోతలు కొనసాగించినట్టు అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

