ఎదులాపురం, మే 31: విత్తనాలను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్‌లో విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దవుతాయని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం ఆదిలాబాద్‌లో ఆయన కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి విత్తనాల షాపులను పరిశీలించారు. స్టాక్ వివరాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. విత్తనాలను అధిక ధరలకు విక్రయించడం, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే లైసెన్సుల రద్దుతోపాటు కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. రైతులు కోరుకునే కంపెనీ విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఒకే రకం విత్తనాలను రైతులు కోరుకోవడంతోనే విత్తనాల కొరత ఏర్పడిందని తెలిపారు.