కేఎంసీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో ఓపీ సేవలు ప్రారంభం
మంత్రి ఎర్రబెల్లి | వరంగల్ నగరంలోని కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో నూతనంగా 150 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖానలో ఔట్ పేషంట్ సేవలు ప్రారంభమయ్యాయి.

వరంగల్ : వరంగల్ నగరంలోని కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో నూతనంగా 150 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖానలో ఔట్ పేషంట్ సేవలు ప్రారంభమయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇటీవల సూపర్ స్పెషాలిటీ దవాఖానను సందర్శించి తక్షణమే వైద్య సేవలు ప్రారంభించాలని ఆదేశించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ దవాఖానలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎంజీఎం హాస్పిటల్‌ను పూర్తి స్థాయిలో కొవిడ్ బాధితుల చికిత్స కోసం వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
నాన్ కొవిడ్ రోగులకు కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ దవాఖానలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. దీంతో నాన్ కొవిడ్ వైద్య సేవలు అందించేందుకు వైద్య అధికారులు చర్యలు చేపట్టి 9 విభాగాలలో ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కేఎంసీ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో పని చేయడానికి డాక్టర్లు, పారా మెడికల్, సాంకేతిక సిబ్బంది ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగా ముగ్గురు సివిల్ సర్జన్లు, ఆర్ఎంవోలు, 16 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, 7 మంది బ్రాడ్ స్పెషాలిటీ నిపుణులు, 134 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక పూర్తయిందని కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి తెలిపారు.
సీఎం కేసీఆర్ చొరవ వల్ల దవాఖానలో రోగులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. కార్డియాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యురాలజీ, గాస్ట్రో ఎంట్రాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, రేడియాలజీ విభాగాల ఔట్ పేషంట్ల సేవలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
చౌడాపూర్ నూతన మండలాన్ని ప్రారంభించిన మంత్రి సబిత
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
అనాథ పిల్లలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే కిశోర్ కుమార్
బీజేపీకి షాక్.. టీఎంసీలోకి ముకుల్‌రాయ్!
రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

