ములుగు : రైతుల పాలిట కల్పతరువు.. ప్రకృతి అందాలకు నిలయమైన లక్నవరం సరస్సు జలకళను సంతరించుకుంది. గత రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండు కుండలా మారింది. లక్నవరం సరస్సు లోనికి 34.5 ఫీట్ల వరద నీరు చేరడంతో సరస్సు మత్తడి దుంకుతూ కనువిందు చేస్తున్నది. లక్నవరం అందాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తూ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.