హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): బెంగాల్ సీఎం మమతపై గంగోపాధ్యాయ చేసిన వాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. ‘దేశంలో ఏకైక మహిళా సీఎం గురించి జుగుప్సాకరమైన, అసహ్యకరమైన, ఆమోదయోగ్యం కానీ వ్యాఖ్యలు చేయడానికి నీకు సిగ్గు ఉందా?’ అంటూ మండిపడ్డారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.