KTR | టీపీసీసీ చీఫ్‌కు కేటీఆర్ లీగల్‌నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు లేకున్నా రాద్ధాంతం చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
- ఫోన్ ట్యాపింగ్ పేరిట దిగజారుడు వ్యాఖ్యలు సిగ్గుచేటు
- బీఆర్ఎస్ నేతలను బద్నాం చేస్తే చట్టపరమైన చర్యలు
- బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే కోర్టుకు లాగుతా
- టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 17 (నమస్తేతెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు లేకున్నా రాద్ధాంతం చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. హామీలు అమలు చేయడం చేతగాకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా కాంగ్రెస్ సర్కారు పెట్టిన అక్రమ కేసుల్లోనూ విచారణకు హాజరై సహకరిస్తున్నామని గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఫోన్‌ట్యాపింగ్ పేరిట నాటకాలడుతున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు అబద్ధాలు ఆడటంలో పోటీపడుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని నడిపించే సత్తా వారికి లేదని, అందుకే ఇలాంటి దుర్మార్గాలకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలను గాలికొదిలి ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు దిగుతున్నదని ఆక్షేపించారు. ఇలాంటి తప్పుడు వ్యవహారాలను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని చెప్పారు. రాజకీయ పబ్బం కోసం పచ్చి అబద్ధాలు చెప్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ను కోర్టుకు ఈడుస్తామని తేల్చిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

