KTR | జై తెలంగాణ అని ఒక్క మాట పలుకలేని మూర్ఖుడు సీఎం రేవంత్: కేటీఆర్
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి కనీస అవగాహన, పరిపక్వత లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన భూపేశ్ భగేల్.. ఛత్తీస్‌గఢ్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర అవతరణ వేడుకలను మూడు రోజులపాటు నిర్వహించారని చెప్పారు. కానీ మన సీఎం మాత్రం దశాబ్ది వేడుకలను ఒక్క రోజుకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వంలో ఉంటే నెలరోజులు నిర్వహించేవాళ్లమని చెప్పారు. తెలంగాణ గురించి గానీ, తెలంగాణ ఏర్పాటులో ఉన్న త్యాగాల గురించి గానీ, జై తెలంగాణ అని ఒక్క మాట పలుకలేని మూర్ఖుడన్నారు.
తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ అవతరణ, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సీఎం రేవంత్ జాక్‌పాట్ ముఖ్యమంత్రి అని, ఏదో అదృష్టవశాత్తు సీఎం అయ్యాడని ఎద్దేవా చేశారు. ఈ విషయం తెలంగాణ మొత్తానికి తెలుసని, ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నదని చెప్పారు. తప్పకుండా ఆయనకు బుద్ధిచెప్పే రోజులు వస్తాయన్నారు. తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్లో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదనా చారి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

