హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ చుక్కాని జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీర్తించారు. ఆదివారం సార్ వర్ధంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధన కోసం మొక్కవోని దీక్షతో మహా తపస్సు చేసిన మహనీయులని కొనియాడారు. భౌతికంగా మన మధ్య లేకు న్నా ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం, అస్తిత్వం, ప్రాంతం ఎదుర్కొన్న అణచివేతలు, అసమానతలు, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి ఎలుగెత్తి చాటిన అసామాన్యులు జయశంకర్ సార్ అని ప్రస్తుతించారు. ఉద్యమసారథి కేసీఆర్కు గురుతుల్యులైన ఆయన సేవలను గుర్తించి బీఆర్ఎస్ ప్రభు త్వం భూపాలపల్లి జిల్లా, వ్యవసాయ యూనివర్సిటీకి ఆయన పేరుపెట్టి సమున్నతంగా గౌరవించిందని గుర్తుచేశారు.