KTR | మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మృతిపట్ల కేటీఆర్ దిగ్భ్రాంతి
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారంభించారు.
హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారంభించారు. వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం కలిగించాలన్నారు. మదన్‌లాల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. గతవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. నాలుగు రోజుల క్రితం వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను స్థానిక దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఏఐజీకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు బంధువులు వెల్లడించారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున వైరా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. దీంతో ప్రస్తుతం ఆయన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

